మన్యం న్యూస్ గుండాల: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యను అందించాలని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన సోమవారం ఆళ్లపల్లి మండలం లోనిఅనంతోగు ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. చదువుతోపాటు పరిశుభ్రంగా ఉండాలని విద్యార్థులకు ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎన్నో వసతులను కల్పిస్తుందని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రంలో ఎన్నడలేని విధంగా పాఠశాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించి వారి భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తుందని అన్నారు. ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని, బాధ్యతగా వ్యవహరిస్తూ విద్యను బోధించాలని సూచించారు