UPDATES  

 దారుణం… ఇద్దరు మైనర్ బాలికలపై 9 మంది అత్యాచారం ఫోక్సో కేసు నమోదు… సీఐ ఉకే అబ్బయ్య

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 30..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్ బాలికలపై 9 మంది అత్యాచారం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సోమవారం త్రీటౌన్ సీఐ అబ్బయ్య తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 జూలై 5న గణేష్ బస్తీలోగల ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు ఆ ఇంటిని తనిఖీచేసి వ్యభిచారం నిర్వహిస్తున్న మొహమ్మద్ షారుక్ ఖాన్, మహమ్మద్ అస్గర్ హుస్సేన్, బుఖ్య సారయ్యను అదుపులోకి తీసుకున్నారు.వీరి సహాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్న మరో ఇద్దరు బానోతు కరుణ, బోనం రాణిల వద్ద ఉన్న ఇద్దరు మైనర్ బాలికలను రక్షించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా 7 నెలల అనంతరం తాజాగా సోమవారం ఆ ఇద్దరు మైనర్ బాలికలపై 9 మంది అత్యాచారం చేసినట్లు గుర్తించారు. వీరిలో పడిగ ప్రశాంత్, దండు వెంకటేష్, గుత్తుల ప్రవీణ్, గారుగ రాజేష్, డికొండ గణేష్, యాసారపు కళ్యాణ్, అంజత్ ఖాన్, డీకొండ దశరథ్ నాథ్,షేక్ రషీద్ ఉన్నారు. వీరితోపాటు వ్యభిచారం నిర్వహించిన వారిని పోస్కో యాక్ట్ కింద రిమాండ్​కు తరలించినట్టు సీఐ తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !