మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మధిర లో ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘అధికారం ఎవడబ్బ సొత్తు కాదు. తాను పెట్టే అభ్యర్థులంతా విజయం సాధించి తీరుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. నేను తప్పు చేయలేదు.వెనకడుగు వేయను. తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా విజయం మాదే.అని అన్నారు.
నాకు, నన్ను నమ్ముకున్న నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది. ప్రజల అభిమానం పొందలేక ఓడిపొతే అసెంబ్లీ ఎన్నికలలో కొందరు నా వల్లనే ఓడిపోయారని తప్పుడు ఫిర్యాదు చేశారు. అవి నమ్మి నాకు సీటు ఇవ్వకుండా నామా నాగేశ్వరరావుకి సీటు ఇచ్చారు. అధికార మదంతో నాతో ఉన్న వారిని ఇబ్బందులు గురి చేశారుఅని పొంగులేటి దుయ్యబట్టారు.