మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 30..దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసారని, ఆ మహానీయుల పుణ్య ఫలంగా నేడు మనందరం స్వేచ్ఛగా జీవించగలుగు
తున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సంగ్రామంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సేవలు, త్యాగాలను స్మరించుకనేందుకు ప్రతి ఏటా జనవరి 30న త్యాగ ధనుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఆ మహనీయుల ఆశయాల సాధనలో మనందరం ముందుకు సాగాలని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.