మన్యం న్యూస్ కరకగూడెం:రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే బిఅర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అదేశాల మేరకు మండల బిఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం 16 గ్రామపంచాయతి లకు గాను 36 గ్రామలకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేసిన ఎంపీపీ రేగా కాళికా-సత్యనారాయణ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, మహిళల మండల అధ్యక్షురాలు కాసు.లావణ్య పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య క్రీడలపై మక్కువ చూపాలని తెలిపారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు ఎంపీటీసీ ఎలిపెద్ది శైలజ పినపాక కోపరేట్ డైరెక్టర్ రావుల కనకయ్య స్థానిక సర్పంచులు ఊకె. రామనాథ,పాయం. నర్సింహరావు, కొమరం విశ్వనాథం, పోలెబోయిన. పాపక్క,భూక్య భాగ్యలక్ష్మి , సాంబ పార్టీ నాయకులు కొంపెల్లి పెద్ద రామలింగం, పోగు వెంకటేశ్వర్లు,కొలగాని పాపారావు.తాటి.వెంగళరావు గుడ్ల రంజిత్ కుమార్,సిద్ధి సునీల్ తదితరులు పాల్గొన్నారు