మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01..ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వులలో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం డిఎస్పీగా షేక్ అబ్దుల్ రెహమాన్ భాద్యతలు స్వీకరించారు.1995 బ్యాచ్ నందు ఎస్సై గా భర్తీ అయ్యి వరంగల్ జిల్లాలోని గూడూరు,మహబూబ్బాద్,సుబేదారీ,సీరోలు,చెన్నారావుపేట,కేసముద్రం,మరిపెడ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వర్తించి 2019వ సంవత్సరంలో సిఐగా పదోన్నతి పొందారు.సిఐగా ములుగు,వరంగల్ ఎస్బిలో పనిచేశారు.అనంతరం 2021 సంవత్సరంలో డిఎస్పీగా పదోన్నతి పొంది వరంగల్ ఏసీబీలో పనిచేస్తూ బదిలీపై కొత్తగూడెం డిఎస్పీగా ఈ రోజు భాద్యతలు స్వీకరించారు.