మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 01: మణుగూరు అంబేద్కర్ సెంటర్లో బుధవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. శ్వేతా మెడికల్, రాజేష్ పాన్ షాప్ కు ఆనుకొని ఉన్న రేకుల షెడ్డు అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ప్రాంతంలో నడిపే హోటల్ మూసివేసి ఉండడంతో అక్కడ జన సందోహం లేదు. ఒకవేళ హోటల్ తెరిచి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు అంటున్నారు. ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.