మన్యం న్యూస్. దమ్మపేట. ఫిబ్రవరి 01. మండలంలోని కొత్తపేటకి గ్రామానికి చెందిన దండు అభిరామ్ వైద్యం కోసం లోకల్ ఎల్ వొ సి రూ.5,00,00- సిఫార్సు చేస్తూ పత్రాన్ని బుధవారం సంబంధిత వారికి అందజేశారు.ఇదే గ్రామం కొత్తపేటకు చెందిన పాలడుగుల రామ లక్ష్మణుడు వైద్యం సహాయం కోసం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సంప్రదించగ ఇటీవలే ఎల్ వొ సి మంజూరు చేయించారు.వైద్యం చేయించి విశ్రాంతి తీసుకుంటున్న వారిని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. మీకు ఎలాంటి సమస్యా ఉన్న సంప్రదించాలని దిగులు చెందాల్సిన అవసరం లేదని, మీ అందరికి అండగా ఉన్నానని, ముఖ్యమంత్రి కేసి ఆర్ ఉండగా మనకు ఎలాంటి బాధపడవలిసిన అవసరం లేదని మనోధైర్యాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ దారా యుగంధర్,అబ్దుల్ జిన్నా,విర బాబు,ఉయ్యాల లక్ష్మి నారాయణ,కృష్ణ తదితరులు ఉన్నారు.