మన్యం న్యూస్.దమ్మపేట.ఫిబ్రవరి 01. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మెరుగైన మార్కులు సాధించి పాఠశాల యాజమాన్యాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. బుధవారం మండల కేంద్రం లో గల జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహార ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావలని కోరారు.అలాగే సొంత ఖర్చులతో ప్రతి రోజూ 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తనవంతు సహాయంగా ఈ మంచి కార్యక్రమంలో పాలుపంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. విద్యార్థుల అల్పాహారం కోసం రూ. 10,000ఇవ్వడం జరిగిందని తెలియజేసారు.మన ఊరు మన బడి కార్యక్రమంలో బాగంగా రూ.53లక్షలతో మన పాఠశాలలో అభివృద్ది కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,ఉప సర్పంచ్ దారా యుగంధర్,అబ్దుల్ జిన్నా,విర బాబు,ఉయ్యాల లక్ష్మి నారాయణ,కృష్ణ తదితరులు ఉన్నారు.