మన్యం న్యూస్ : జూలూరుపాడు, ఫిబ్రవరి 01… వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ తాత మదు సూదన్ ఆదేశాల మేరకు, మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు పొన్నెకంటి సతీష్ కుమార్ మాట్లాడుతూ.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివిధ నియోజకవర్గ లలో ఆత్మీయ సమ్మేళనలా పేరుతో సభలు నిర్వహించి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ లను విమర్శించడం విడ్డూరంగా ఉందని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని అన్నారు ఈ పద్దతిని మార్చుకోకపోతే సహించేది లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పధకాల కారణంగానే వివిధ పార్టీ ల నాయకులు టిఆర్ఎస్ లో చేరారు గాని, శ్రీనివాస్ రెడ్డి ని చూసి కాదని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన వల్లనే పార్టీ పటిష్టమైందని పొంగులేటి అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పొంగులేటి “వాపును చూసి బలుపు” అనుకుంటున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోని, మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, మండల ఉపాధ్యక్షుడు ఎస్కే మైబు, సర్పంచ్ కిషన్ లాల్, దుద్దుగూరి కృష్ణ ప్రసాద్ మోదుగు రామకృష్ణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పనితీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.