మన్యం న్యూస్.ములకలపల్లి. ఫిబ్రవరి 01.
మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు శ్రీ సద్గురు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ సద్గురు ఆశ్రమం అచలపీటం స్థాపకులు డా. జి.వీరభద్రమ్ ఆశిస్సులతో వెల్లటూరి ప్రసదా చారి ఆధ్వర్యంలో జరుగుతున్న మహా సంప్రోక్షణ కు బుధవారం అశ్వారావుపేట స్థానిక శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.అనంతరం గణపతి హోమం,మహాలక్ష్మి హోమం కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిదులు నాయకులతో కలిసి పాల్గొనీ ఆలయానికి రూ. 10,116 విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని అకాక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మట్ల నాగమణి, అన్నపురెడ్డిపల్లి జెడ్పీటీసీ లావణ్య భరత్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపుడి అప్పారావు,సర్పంచ్ సున్నం సుధాకర్,సున్నం సుశీల,గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ రావు,భారత్ రాంబాబు,వేణు,తదితరులు పాల్గొన్నారు.