మన్యం న్యూస్ చండ్రుగొండ ఫిబ్రవరి 01: మండల పరిషత్ కల్యాణ లక్ష్మి కార్యక్రమంలో బుధవారం ఎంపీపీ బానోత్ పార్వతి ఎమ్మెల్యే వర్గీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 19 మంది లబ్ధిదారుల కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అధ్యక్షతన జరిగింది. ఇటీవల ఎమ్మెల్యే వర్గీయులు ఎంపీపీ పై పలు ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో కల్యాణ లక్ష్మి కార్యక్రమం వేదికగా చేసుకొని తనపై ఆరోపణలు చేసిన వారిపై హెచ్చరించారు. మండలానికి మంజూరైన రూ. కోటి నిధులు ఎమ్మెల్యే తనకు ఇచ్చారని ఎమ్మెల్యే వర్గీయులు చేసిన ఆరోపణలను ఖండించారు. బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఎంపీపీ గా ఉన్న ఎమ్మెల్యే పర్యటన ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచారని ధ్వజమెత్తారు. దళితబంధు, సీసీ రోడ్లు మంజూరైన తనకు, ఎంపీటీసీలకు చెప్పకుండా ఎమ్మెల్యే వర్గీయులు పంచుకుంటున్నారని విమర్శించారు. గిరిజన ఎంపీపీ కించపరిచేలా ఎమ్మెల్యే వర్గీయులు ప్రవర్తిస్తే సహించమని హెచ్చరించారు. కార్యక్రమానికి సంబంధంలేని ప్రసంగాన్ని విన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఏమి జరుగుతుందోనని ఉత్కండంతో ఉన్నారు. ఎంపీపీకి ఎమ్మెల్యే వర్గీయులు ఎదురు సమాధానం చెప్పకపోవడంతో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఎంపీటీసీ ధారా బాబు, లంక విజయలక్ష్మి, సర్పంచ్ రన్యా, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు,భూపతి రమేష్, రెవిన్యూ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.