UPDATES  

 రాష్ట్ర ప్రగతిని విమర్శించేవారు.. కంటి వెలుగు కళ్ళజోడు తీసుకోండి

రాష్ట్ర ప్రగతిని విమర్శించేవారు..
కంటి వెలుగు కళ్ళజోడు తీసుకోండి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది.
ప్రతిపక్ష నాయకులకు హితువు పలికిన
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్, భద్రాచలం , ఫిబ్రవరి 01..
రాష్ట్రంలో కంటి వెలుగు పథకం కింద ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇస్తున్నామని, రాష్ట్ర ప్రగతిని విమర్శిస్తున్న ప్రతిపక్షా నాయకులు ఆ అద్దాలు పెట్టుకొని చూస్తే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలోని హరిత హోటల్ లో భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ దేశానికి చాలా అవసరమని ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు. రైతులకు న్యాయం చేస్తున్న ఏకైక నేత సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ తెలంగాణను పట్టించుకోవడం లేదని విమర్శించారు.తాము దేశమంతా ఉచిత కరెంట్, దళితులకు దళిత బంధు, రైతులకు రైతుబంధు ఇస్తూ ఉంటే కొందరు కడుపు మంటతో బాధపడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కంటి వెలుగు పథకం కింద ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇస్తున్నామని, రాష్ట్ర ప్రగతిని విమర్శిస్తున్న ప్రతిపక్షా నాయకులు ఆ అద్దాలు పెట్టుకొని చూస్తే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కనిపిస్తుంది అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు బిజెపి ప్రభుత్వం పాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రంలో నైనా ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో దేశంలో తెలంగాణ అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచింది పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగ్యస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూగురు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదే బోయిన బుచ్చయ్య, భద్రాచలం మండలం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అరికెళ్ల తిరుపతిరావు, దుమ్ముగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నెం సత్యనారాయణ మూర్తి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కే.కృష్ణమూర్తి, రాంబాబు, ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !