UPDATES  

 మణుగూరు ఏరియా నూతన జిఎం గా బాధ్యతలు స్వీకరించిన దుర్గం రాంచందర్ సమిష్టి కృషితో సంస్థ పురోభివృద్ధికి పాటుపడుదాం- జిఎం

 

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 01..
మణుగూరు ఏరియా నూతన జిఎం గా దుర్గం రాంచందర్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది.ఈ సందర్భంగా జిఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ, యావత్ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి,రవాణాలో మణుగూరు ఏరియాకు ఎంతో గుర్తింపు,ప్రత్యేక స్థానం కలిగిన మణుగూరు ఏరియాకు వచ్చి జనరల్ మేనేజర్ గా భాద్యతలు స్వీకరించడం, మణుగూరు ఏరియా సింగరేణియుల కుటుంబ సభ్యుల్లో నేను ఒకడిగా స్థానం పొందడం ఎంతో సంతోషదాయకంగా ఉంది అని తెలిపారు.నేను ఈ ఏరియాకి సాంకేతికంగా టీమ్ లీడర్ అయినప్పటికీ అధికారుల, ఉద్యోగుల సపోర్ట్ ఎంతో అవసరం అని,అందరి తోడ్పాటుతో,కార్మిక సంఘాల నాయకుల సహకారంతో, శ్రమశక్తి మరియు యాంత్రిక శక్తిని పూర్తిగా వినియోగించుకుంటూ,బొగ్గు అధికోత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్న మణుగూరు ఏరియా ఆనవాయితీని మునుముందు కూడా కొనసాగించడమే కాకుండా రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గును వార్షిక లక్ష్యాలను అధిగమించేలా సాధించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలియజేశారు.అలాగే కార్మికుల సంక్షేమానికి, సౌకర్యాలకు తగు ప్రాధాన్యత ఇస్తానని తెలియజేశారు. మనమందరం సంస్థ పురోభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని తెలిపారు.ఈ సందర్భంగా ఏరియా ఉన్నత అధికారులు,ఏరియాలోని వివిధ విభాగాల అధికారులు, జిఎం కార్యాలయ అధికారులు నూతన జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్ కు పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికి,శాలువాలతో సత్కరించారు.పూజ కార్యక్రమం అనంతరం జనరల్ మేనేజర్ భాద్యతలు స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఎస్ఓ టు జిఎం డి లలిత్ కుమార్,ఏజిఎం కేపియూజి జి నాగేశ్వర రావు, ఏజిఎం సివిల్ డి వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజినీర్ నర్సీ రెడ్డి, ఏఎసీ శ్రీ వెంకట రమణ,పిఓ పికేఓసి టి లక్ష్మీపతి గౌడ్,పిఓ- ఎంఎన్జిఓసి శ్రీనివాస చారి, డిజిఎం ఐఈడి కే వెంకట్ రావు, డిజిఎం పర్సనల్ ఎస్ రమేష్, పిఏ టు జిఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !