మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 01 కరకగూడెం మండల పరిదిలోని చిరుమల్ల గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవం మంగళవారం రాత్రి 10 గంటలకు మండమెలుగు కార్యక్రమంతో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆదివాసి సంప్రదాయాలతో గుడి పూజారులు ప్రారంభించారు. రెండవ రోజైన బుధవారం ఇలవేల్పులు సమ్మక్క గద్దెకు ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి భారీగా చేరుకుంటున్నాయి.డోలు వాయిద్యాలు ముత్యాలతో ముఖద్వారం వద్ద ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలుకుతూ గుడికి తీసుకు వెళుతున్నారు. గత ఐదు సంవత్సరాల్లో జరగని విధంగా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చందా లింగయ్య దొర,చందా. బిక్షపతి భూపతయ్య వీరయ్య తెలిపారు. అప్పటికే 108 కి పైగా వేల్పులు జాతరకు వస్తున్నాయని జాతరలో ముఖ్యమైన వేల్పుల సమ్మేళనం ప్రజలను ఆకర్షిస్తుందని వారు తెలిపారు . ఆలయ కమిటీ వారు గుడిని అందంగా తీర్చిదిద్దారు రంగురంగుల కాంతులతో గుడు గుడి నాలుగు ప్రక్కల ఎల్ఈడి విద్యుత్ కాంతులు వేల్పులకు అసౌకర్యాల కలగకుండా వారికి ప్రత్యేకమైన టెంట్లు ఏర్పాటు చేశారు. చూసేవారికి ఆనందం కలిగేలా చుట్టూ షాపులు డీజే సౌండ్లు ఉండడంతో జాతర నా భూతో నా భవిష్యత్తు అనే సందాన ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. చుట్టుపక్క గ్రామాల నుండి మండవెలుగు కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.