UPDATES  

 కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పోరేట్, బీజేపీ పాలిత రాష్ట్రాల బడ్జెట్ నిరుద్యోగం, రైతాంగం, విభజన హామీలను పూర్తిగా విస్మరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01…. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి బడ్జెట్ కార్పోరేట్ శక్తులకు, బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్నికలు జగరబోయే రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టి బడ్జెట్గానే ఉందని, ఈ బడ్జెట్ వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా పేర్కొన్నారు. కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టిన 2023–24 బడ్జెట్పై ఆయన స్పందిస్తూ బడ్జెట్ అంశాల్లో నిరుద్యోగులు, రైతాంగ సంక్షేమానికి సంబందించిన అంశాలను పొందుపర్చకపోవడం సరైందికాదన్నారు. దాన్యం కోనుగోలు ప్రోత్సాహాన్ని తగ్గించి, క్రాఫ్ ఇన్సూరెన్సుకు కోత పెట్టడంతోపాటు మార్గెట్లో రైతుల ఉత్పత్తులకు బడ్జెట్లో కోతలు పెట్టి రైతాంగానికి అన్యాయం చేశారని, ఉపాధిహామీ పథకంలో భారీ కోత పెట్టి పేదలకు అన్యాయం చేశారన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే అంశాన్ని పొందుపర్చకుండా యువతను నిరాశపర్చారని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్శిటి వంటి రాష్ట్ర విభజన హామీల విస్మరించారని పేర్కొన్నారు. జీఎస్టీలో రాష్ట్రాలకు రావాల్సిన వాటాల పెంపుదలకు సంబందించి ప్రస్తావన లేకపోవడం దుర్మార్గమైందన్నారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడటానికి ఎలాంటి చర్యలు లేవని, మొత్తంగా ఈ బడ్జెట్ పేదలను కొట్టి ఆదాని, అంబానీల వంటి కార్పొరేట్ దిగ్గజాలకు పంపిచపెట్టే విదంగా రూపొందించారని, ఈ బడ్జెట్ వల్ల అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !