మన్యం న్యూస్.దమ్మపేట. ఫిబ్రవరి 01. మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు లేవని స్థానిక శాసన సభ్యులు మెచ్చ నాగేశ్వరరావు కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.ప్రభుత్వ ఆసుపత్రికి 30 పడకలు మంజూరు చేయించాలని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు స్థానిక ఆసుపత్రిలోనే చేయాలని, ప్రసూతి కాన్పులను ఇక్కడే చేసే విదంగ, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు 24 గంటలు అందేలా, ఇద్దరు డాక్టర్లను నియమించాలని, ఇక్కడి స్టాప్ క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని,ఇ.సి.జి,సి.టి.జి. ఏర్పాటు చేయాలని అన్నారు.త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆరోగ్య శాఖ మంత్రి కి,ముఖ్యమంత్రి కె సి ఆర్ కు ఈ సమస్యలను వివరించి పరిష్కారించే దిశగా చూడాలని కోరారు.దానికి స్థానిక ఎమ్మెల్యే సాననుకూలంగా స్పందించి వెంటనే దమ్మ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వసంతులన్నీ అమలకై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిరు.ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి,ఏఐటియుసి మండల కార్యదర్శి బెజవాడ రాము, రైతు సంఘం కార్యదర్శి గాజు బోయిన కృష్ణవేణి,మహిళా సంఘ అధ్యక్ష కార్యదర్శులు జానీ బేగం,తుపాకుల శాంతి,దళిత హక్కుల పోరాట సమితి కార్యదర్శి నక్క నాగమణి,మైనార్టీ సెల్ కార్యదర్శి జాన్ బి,తదితరులు పాల్గొన్నరు.