UPDATES  

 భద్రాచలం లో రేగా విస్తృత పర్యటన

 

మన్యం న్యూస్, భద్రాచలం :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వం విప్, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగా కాంతారావు బుధవారం భద్రాచలం పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గ కేంద్రంగా జరిగిన రేగా పర్యటనలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ ఆయన పాల్గొన్న కార్యక్రమాలను విజయవంతం చేశారు.

– ప్రమాదంలో గాయపడిన బొగ్గు ముఠాకార్మికుడిని పరామర్శించిన రేగా
మణుగూరు మండలం శాంతినగర్ కి చెందిన కనుకుర్తి శ్రీను అనే బొగ్గు ముఠా కార్మికుడు ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆ కార్మికులను బుధవారం పరామర్శించారు. చికిత్స పొందుతున్న కార్మికులతో మాట్లాడి యోగక్షేమలు అడిగి తెలుసుకుని భరోసా కల్పించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు.

– శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విప్ రేగా

భద్రాచలం పర్యటనలో భాగంగా భద్రాచలం పట్టణంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఆలయం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే రేగా కాంతారావు కి ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ, సంక్షేమంలో అభివృద్ధిలో మన తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. రైతులు అంతా పాడిపంటలతో పిలిసిల్లాలని అందరు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన అన్నారు.

– స్వీట్ షాప్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా

భద్రాచలం పట్టణం లోని బ్రిడ్జి రోడ్డు మధువన్ రెస్టారెంట్ ఎదురుగా కొత్తగూడెం పట్టణానికి చెందిన మామిడి వాసు, దుర్గాప్రసాద్ లు నూతనంగా ఏర్పాటుచేసిన ధనలక్ష్మి స్వీట్ షాప్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు యాజమాన్యం వారు సాదర స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి అందజేశారు. పట్టణ ప్రజలకు అందుబాటులో నూతన వడివకలతో ప్రారంభించిన స్వీట్ షాప్ ప్రజల మన్ననలు పొందాలని యాజమాన్యానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు శుభాకాంక్షలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !