మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి01: ఇల్లందు స్టేషన్ భస్తిలో మన ఊరు మన బడి కార్యక్రమంలో నూతనంగా నిర్మాణం జరిగిన ఉర్దూ పాఠశాలను బుధవారం ఎమ్మెల్యే హరిప్రియ ,జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టీ కలిసి ప్రారంభించారు.మన బడి ద్వారా, అవసరం అయిన కొత్త పాఠశాలల నిర్మాణం, పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పన ద్వారా విద్యార్థుల చదువుకు ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం తీసుకురావాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు.కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 300 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచబడి ప్రారంభించటానికి సిద్దంగా ఉన్నాయన్నారు.బాల బాలికలకు మంచి నీరు దగ్గర నుంచి వేరువేరు టాయిలెట్స్,కంపౌడ్ వాల్ మొదలైనవి అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డివి,వైస్ చైర్మన్ నబీ, వార్డ్ కౌన్సిలర్స్,పుర ప్రముఖులు పాల్గొన్నారు.