మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 01: అశ్వారావుపేట మండలం నూతన తహసిల్దార్ గా బుధవారం లూథర్ విల్సన్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జిల్లా కలెక్టర్ విడుదల చేసిన తహసిల్దార్లు బదిలీ ఉత్తర్వులు భాగంగా జూలూరుపాడు తహసిల్దార్ గా పనిచేస్తున్న లూథర్ విల్సన్ అశ్వరావుపేటకు బదిలీ అయ్యారు. కాగా బుధవారం ఆయన బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది విఆర్ఏ లు నూతన తహసిల్దార్ కు పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.