మన్యం న్యూస్,అశ్వాపురం:అశ్వాపురం
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్య ప్రకాష్ అద్యక్షతన బదిలీ తహశీల్దార్ సురేష్ కుమార్ కి ఘన సన్మానం జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ… ఆశ్వాపురం తహశీల్దార్ గా జాయిన్ అయిన రోజు నుండి…మండలంలో రెవెన్యూ పరంగా, కరోనా కష్ట కాలంలో, గోదావరీ వరదల సమయంలో అన్ని శాఖల వారిని సమన్వయం చేస్తూ
విశిష్ట సేవా కార్యక్రమాలను, అమలు చేశారని తహసిల్దార్ సురేష్ సేవలు మరువలేని అని అన్నారు. బదిలీ అయిన తహశీల్దారు సురేష్ కుమార్ ని కళాశాల అధ్యాపకులు, విద్యార్ధినీ విద్యార్ధులు ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలికారు.