UPDATES  

 రైతు రాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా చౌకబారు వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ రెడ్డి కి మతి ఉందా? లేదా? * వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి

మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:రైతు రాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా కొనసాగుతోంది అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారంమధిర నియోజకవర్గం ముదిగొండ మండలం మదాపురం రైతువేదిక ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , జడ్పీ చైర్మన్ కమల్ రాజు , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలిసి ప్రారంభించారు.రైతు
వేదిక అవరణంలో జరిగిన రైతు సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన రైతులను ఉద్దేశించి వారు మాట్లాడారు.
రైతు రాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షమైన రైతు పాలనను అందిస్తున్నారని ముఖ్యమంత్రి బృహతమైన నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలకు అన్నం పెట్టగల సామర్థ్యం గల దేశ రైతాంగాన్ని గత పాలకులు, ప్రస్తుత బిజేపీ ప్రభుత్వం చిన్న చూపుతో గాలికి వదిలారని, సాధించుకున్న తెలంగాణలో దేశానికి ఆదర్శంగా సీఎం కెసిఆర్ రైతులకు మద్దతు తెలుపుతూ రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ కి మాత్రమే దక్కిందని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండే విధంగా రైతు వేదికను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా రైతు రాజ్యం స్థాపించే దిశగా కేసీఆర్ వేస్తున్న అడుగులు విజయానికి చేరుతాయని , దేశ ప్రజలకు తెలంగాణ సంక్షేమ పథకాలు అందాలని తన బలమైన ఆకాంక్షను తెలియజేశారు.

రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే పార్టీలో చేరాలనుకునే శ్రీనివాస్ రెడ్డి కళ్ళు మూసుకుపోయాయి
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందుతున్న ఉచిత నాణ్యమైన విద్యుత్ పై ఇటీవలే చౌకబారు వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ రెడ్డి కి మతి ఉందా? లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలోని కనిజ సంపదలను మింగేందుకు పాయదయాత్ర చేసే వ్యక్తులతో లేదా తెలంగాణ పై కక్ష సాధింపు చేసే బిజెపి నాయకులతో తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా ప్రమాదమే తలెత్తుతుందని రాష్ట్ర ప్రజలు గ్రహించారని, ఎవరిని కుట్రలు పన్నిన వారి కుట్రలు కుట్రలుగానే మిగిలిపోతాయని , గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ముందు కుటిల రాజకీయ నేతల ఆటలు సాగబోవు అని తెలియజేస్తూ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమ్ , రాష్ట్ర విత్తన అభివృద్ధి శాఖ చైర్మన్ కొండ బాల కోటేశ్వరరావు , డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , డి.ఎస్.ఎం.హెచ్ చైర్మన్ రాయల శేషగిరిరావు , జిల్లా రైతు సమన్వయ అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వర్లు , ప్రజాప్రతినిధులు , వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !