UPDATES  

 నూతనంగా నియమితులైన ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ రషీద్ ఖాన్ కు ఘన సన్మానం ఏడు మండలాల్లో విధులు నిర్వహించనున్న ఖాజీ అబ్దుల్ రషీద్

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01..; ముస్లిం సమాజ పెళ్లి ,విడాకులు ఇతరత్రా సేవలను వక్ఫ్ బోర్డు ఆధీనంలో చట్టబద్దత కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర…మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాజీ యాక్ట్ 1880 ప్రకారం…కొత్తగూడెం చుట్టుపక్కల 6 మండలాలకు ప్రభుత్వ ఖాజీ గా మొహమ్మద్ అబ్దుల్ రషీద్ ఖాన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నూతనంగా నియమితులైన ఖాజీ అబ్దుల్ రషీద్ బుధవారం చుంచుపల్లి మండలంలోని ఎల్.ఐ.సి కార్యాలయం సమీపంలోని మదినా మస్జిద్ లో కొత్తగూడెం పట్టణ అన్ని జమాత్ ల ప్రముఖులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ ముస్లిం తనకు ఖాజిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముస్లిం సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తానని ,వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం నూతన ఖాజీ అబ్దుల్ రషీద్ ఖాన్ ను ముస్లిం హక్కుల పోరాట సమితి సభ్యులు అబ్దుల్ జలీల్ ,ఎం. డి.ఖలిళ్ ,జమియతే ఉలేమాయే హింద్ జిల్లా అధ్యక్షుడు కరీం మౌలానా ,గౌసుద్దీన్ , మరియు జమియతే అహెలే హాదిస్ అధ్యక్షుడు అబ్దుల్ ముఖిత్ జావిద్ , ఇస్మాయిల్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ సభ్యులు షేక్ బాసిత్ ,తెలంగాణ ఉద్యమకారులుఇమ్రాన్,మసూద్ ,అన్వర్ ,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !