UPDATES  

 రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్టు పంపిణీ

మన్యం న్యూస్,కరకగూడెం:
ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరకగూడెం మండల కేంద్రంలో ని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పలు జట్లకు విలువైన వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్,ఎంపీపీ రేగా కాళికా లు మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా ఉన్న వాలీబాల్ క్రీడాకారులకు రేగా విష్ణు మెమొరియబుల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోవాలీబాల్ కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడలు ఆడడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, క్రీడల ఆడడం వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ప్రతిభావంతమైన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎలిపెద్ది శైలజ శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి పినపాక మండల కోపరేటివ్ డైరెక్టర్ రావుల కనకయ్య,స్థానిక సర్పంచ్ ఊకే రామనాథం, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు పాయం నరసింహారావు,పోలేబోయిన నర్సింహారావు, కొమరం విశ్వనాధం, పోలేబోయిన పాపక్క, భూక్యా భాగ్యలక్ష్మి, అరేం సాంబ-బిక్షపతి, తోలేం సావిత్రి-సారయ్య,బూర్గంపాడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు, కొంపెల్లి పెద్ద రామలింగం, పోగు వెంకటేశ్వర్లు బైరిశెట్టి చిరంజీవి, కొలగాని పాపారావు,తాటి వెంగళరావు,కాసు లావణ్య,గుడ్ల రంజిత్, సిద్ది సునీల్ కుమార్, గిద్దె సాయికిరణ్, సాధనపల్లి లక్ష్మీనారాయణ, దాసరి సాంబయ్య, యాకుబ్ ఖాన్, బొబ్బల నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !