*రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ లో జాతీయ నూతన విద్యావిధానం భర్తరఫ్ చేయాలి.
పి.డి. ఎస్.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.నామాల ఆజాద్
*విద్యారంగానికి 30%నిధులు కేటాయించాలి
పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
*ఖమ్మం జిల్లాకు యునివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడికి రౌండ్ టేబుల్ తీర్మానం
మన్యం న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
కేంద్ర ప్రభుత్వం విద్య కార్పొరేటీకరణ కాషాయీకరణ చేసే జాతీయ విద్యా విధానంను తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ సమావేశలలో బర్తరఫ్ చేసి కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పి.డి. ఎస్. యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యన్. అజాద్ ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో విద్యా రంగానికి 30%శాతం నిధులు కేటాయించాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పి డి ఎస్ యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో బుధవారం పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అధ్యక్షతన ఖమ్మం నగరంలోని ఆ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ… విద్యారంగంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం రూపొందించి పార్లమెంట్లో కనీస చర్చ లేకుండా బి జె పి ప్రభుత్వం ఆమోదించుకున్నారని వారు విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 సంవత్సరం బడ్జెట్ నుండి ప్రతి బడ్జెట్లో విద్యకు నిధులు తగ్గిస్తుందని దుయ్యబట్టారు. విద్యారంగ అభివృద్ధికి నిధుల శాతం పెంచడం లేదని , రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి మొన్నటి 2022 బడ్జెట్ వరకు కూడా నామమాత్రం నిధులు ఇస్తూ విద్యారంగం పట్ల నిర్లక్ష్యం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కనీసం సగం నిధులు కూడా కేటాయించడం లేదని బిఅర్ఎస్ పార్టీ ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోమంటున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్య విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సమస్యలు నిలయంగా ఉన్నాయని కనీస మౌలిక వసతులు లేవని, యూనివర్సిటీలు అభివృద్ధికి నోచుకోవడం లేదని రాష్ట్ర బడ్జెట్ లో ఒక్కో యూనివర్సిటీలకు ప్రత్యేక నిధులు కటాయించాలని, ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు నిధులు కేటాయించాలని, సంక్షేమ హాస్టల్స్ సమస్యల పరిష్కారం కోసం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచడం కోసం నిధులు కటాయించాలని డిమాండ్ చేశారు… ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల లేదని పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్న ప్రభుత్వం మొదటి విడతలో 3000 కోట్లు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామoటున్న ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం మూడు ప్రభుత్వ పాఠశాలలైన పూర్తి స్థాయిలో తీర్చిదిద్దలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో 30%నిధులు కేటాయించి ప్రభుత్వ విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సుభాన్ ఎం ఎస్ ఎఫ్ జిల్లా బాధ్యులు సురేష్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ద్వంద వైఖరి వీడి అసెంబ్లీలో యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు , మేధావులతో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ , పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి సతీష్, ఖమ్మం డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ , ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు యువరాజ్, విద్యార్థి సంఘాల నాయకులు తరుణ్, శివ, రాకేష్, స్టాలిన్, సాయి, ప్రేమ్ కుమార్ ,మల్సూర్ , రవితేజ, గణేష్,నవీన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.