మన్యం న్యూస్,పినపాక, ఫిబ్రవరి02…
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం సాయిబాబా ఆలయ కమిటీ నూతన చైర్మన్ గా ముక్కు నర్సారెడ్డిని గురువారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.