మన్యం న్యూస్ చండ్రుగొండ ఫిబ్రవరి 04: మండల పరిధిలోని రావికంపాడు గ్రామపంచాయతీలో శనివారం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భూపతి రమేష్ అధ్యక్షతన సర్పంచ్ బానోత్ రన్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ముందున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇమ్మడి ముక్తేశ్వరరావు, జగన్, గాలం నరేష్, గాలం రవి, నిజాంపట్నం మల్లికార్జునరావు, భూక్య బద్రు, బాదావత్ వెంకటేష్, మెట్టల నరసింహారావు, డోజర్ ఎండి సలీం, ఇనుముల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.