UPDATES  

 టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 08…
ములుగులో పాదయాత్రలో భాగంగా తెలంగాణా ప్రగతికి చిహ్నమైన ప్రగతి భవన్ ను గ్రేనేడ్స్ తో పేల్చేయాలంటూ.. టీపీపీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి చేసిన అనుచితమైన వాఖ్యలకు నిరసనగా బుధవారం ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్ ఆదేశాలు మేరకు మండల పార్టీ అధ్యక్షులు మంగపేట మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ, మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఈ సందర్బంగా బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ ఒక పార్టమెంట్ సభ్యుడుగా ఉండి పరిపాలనా భవనం, తెలంగాణ ప్రగతికి చిహ్నమైన “ప్రగతి భవన్” ను గ్రైనేట్స్ తో పేల్చేయమనటం హేయమైన చర్య ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాడు నక్సలిజాన్ని నిషేదించింది కాంగ్రేస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ నేడు నక్సలైట్లతో ప్రగతి భవన్ ను గ్రేనేడ్స్ తో పేల్చేయండి అనడాన్ని తీవ్రంగా ఖండించారువెంటనే అనుచితమైన వాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని ఎంపీ పదవి నుంచి భర్తరప్ చేసి, ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏఐసీసీ హైకమాండ్ ను డిమాండు చేశారు ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, శంకర్, హరిబాబు, నర్సింహారావు, చిట్టీమల్ల సమ్మయ్య, కటికనేని సత్యనారాయణ, అచ్చ సత్యనారాయణ,కుంట ఏడుకొండలు, శ్యాంబాబు, శ్రీనివాస్ యాదవ్,తుక్కని శ్రీనివాస్,సాంబశివరావు,
భద్రయ్య, ప్రవీణ్, పార్వతమ్మ, సత్యనారాయణ, విష్ణు,శ్రీహరి కిషోర్, వెంకట్ రెడ్డి,బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో  పాలుగోన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !