UPDATES  

 పెండింగ్ ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి….

మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి08: మణుగూరు మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం అమలు చేయాలని సామాజిక కార్యకర్త కర్నె రవి కోరారు. ఆయన బుధవారం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా వాహనాల కొనుగోలు చేసిన, కొత్తగా సిమెంట్ బల్లాలు కోనుగోలు చేసిన, సీసీ కెమెరాలు కోనుగోలు చేసిన, సెల్ ఫోన్లు కోనుగోలు చేసిన,తడి చెత్త, పొడి చెత్త డబ్బాలు కోనుగోలు చేసిన, గ్రావెల్ తోలకాలు, కొత్త ఇంటి నెంబర్ ఇవ్వడంలో,ఇంటి పేరు మార్పిడి లో మణుగూరు మున్సిపాలిటీ అధికారులు అవినీతి మయమన్నారు. మణుగూరు మున్సిపాలిటీ కార్యాలయంలో అవినీతి అక్రమాలు చేసి సస్పెండ్ అయిన అధికారులను తిరిగి మరల బదిలీ పైన వస్తున్నారు అంటే మణుగూరు మండలం లో ఉన్న మేధావులు, రాజకీయ నాయకులు, ఆలోచన చేయాలన్నారు. పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపాలిటీలో పెరిగిన జీతాలు ఇవ్వగా మణుగూరు మున్సిపాలిటీలో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. గత మూడు నెలలుగా జీతాలు లేక కాంట్రాక్ట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, పెరిగిన జీతాలు కూడా చెల్లించాలని, లేనియెడల లేబర్ కోర్టులో కాంటాక్ట్ కార్మికుల తరఫున కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !