UPDATES  

 దేశ వ్యాప్తంగా గవర్నర్‌ల ఆకస్మిక బదిలీలు, మార్పులు

దేశ వ్యాప్తంగా గవర్నర్‌ల ఆకస్మిక బదిలీలు, మార్పులు చోటుచేసుకున్నాయి. ఏపీ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ నియామకమే ఇప్పుుడు కొత్త వివాదాన్ని రేపుతోంది. ఏపీ గవర్నర్‌గా ఎస్ అబ్దుల్ నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ నియామకాన్ని ఆమోదించారు. జనవరి 4వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఎస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా 12 మంది గవర్నర్ల బదిలీలు, మార్పులు జరిగినా..అబ్దుల్ నజీర్ నియామకంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తిగా మూడు వివాదాస్పద కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులివ్వడం వల్లనే ఈ పదవి వరించిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని గవర్నర్‌గా నియమించడమేంటని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ ప్రశ్నించారు. పలు కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే అబ్దుల్ నజీర్‌కు గవర్నర్ పదవి కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ 2012లో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. తీర్పులు ఉద్యోగాల్ని ప్రభావితం చేస్తాయి, పదవీ విరమణకు ముందు ఇచ్చే తీర్పులు, పదవీ విరమణ తరువాత ఉద్యోగాలను ఇస్తాయని అరుణ్ జైట్లీ వ్యాఖ్యల వీడియోను జైరాం రమేశ్ పోస్ట్ చేశారు. దేశంలో గత మూడు, నాలుగేళ్లుగా ఇదే జరుగుతోందని జైరాం రమేశ్ విమర్శించారు. ఇప్పుడు అబ్దుల్ నజీర్ నియామకమే దీనికి నిదర్శనమన్నారు. నాటి తీర్పుల వల్లే నేటి పదవులంటూ కేంద్రాన్ని విమర్శించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !