మానవత్వం చాటుకున్న బిక్కసాని, జలగం
మన్యం న్యూస్, సారపాక/భద్రాచలం , ఫిబ్రవరి 24
అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వ్యక్తి కుటుంబానికి స్థానిక పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శుక్రవారం ఆర్థిక సాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. సారపాక పట్టణంలోని గాంధీ నగర్ కాలనీకి చెందిన కొప్పుల నాగేశ్వరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. తన కూతురు పదవ తరగతి పరిక్షలకు సిద్ధం అవుతున్న సమయంలో స్కూలు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొన్న బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బిఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. గతంలో కూడా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కొప్పుల నాగేశ్వరావు కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లి రూ.2.50 లక్షలు ఎల్.వో.సి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ సెక్రటరీ తిరుపతి ఏసోబు, నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకొట్టి పూర్ణ చందర్రావు, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, పార్టీ నాయకులు బెజ్జంకి కనకాచారి తదితరులు పాల్గొన్నారు.
