మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 24.. పాత పేరాయిగూడెం రోడ్డుకు, ఫైర్ కాలనీలోని రోడ్డుకు మోక్షం లభించింది. పేరాయి గూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ నార్లపాటి సుమతి చొరవతో రూ. 48 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు కాబడిన సీసీ రోడ్డుకు సర్పంచ్ సుమతి శుక్రవారం కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత పేరాయి గూడెంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, పంచాయతీ నిధులు విడుదల కాగానే మిగిలిన రోడ్లకు కూడా సిసి రోడ్లుగా మారుస్తామని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు. ఎమ్మెల్యే సీసీ రోడ్లకు 48 లక్షలు నిధులు ఇచ్చినందుకు పేరాయి గూడెం సిసి రోడ్డు ఏర్పాటు చేసినందుకు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకుకి సర్పంచి నార్లపాటి సుమతి ధన్యవాదాలు తెలియజేశారు. మిగిలిన సమస్యలు కూడా పంచాయతీ నుండి పరిష్కారమయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె పాషా, వార్డు మెంబర్లు చిప్పనపల్లి శ్రీను, నార్లపాటి సత్యం, తాతారావు, నార్లపాటి సోమేష్, ఉదయ్, మహేష్, సురేష్ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.