మన్యం, న్యూస్ మంగపేట, ఫిబ్రవరి 24
మంగపేట మండలం కమలాపురం అంగన్వాడీ కేంద్రం(ఫ్రీ ప్రైమరీ స్కూల్ )లో సోపార్ బాల వికాస కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కెనడా ఫండ్ ఫర్ ఇన్సియేటివ్ వారి ఆర్థిక సహాయంతో శుక్రవారం పైలెట్ ప్రాజెక్ట్ గా కమలాపురం గ్రామంలో 40 మంది గర్భిణీలకు పౌష్టికాహారం గా డ్రై ఫ్రూట్, సఫ్రాన్ పౌడర్,పండ్లు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా 25 ట్రైబల్ స్కూళ్లలో నెలసరి పై లైంగిక పునరుత్పత్తి,ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పించి ఏడుగురితో కూడిన కమిటీని స్కూల్ కి ఒకటి చొప్పున వేసి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది అని వారు ఈ సందర్బంగా తెలిపారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు ఆశ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది అనిఅన్నారు.శానిటరీ ప్యాడ్ బర్నింగ్ మిషన్ మరియు కాలుష్యం నియంత్రణకై మొక్కలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బాలవికాస ఆర్గనైసింగ్ మేనేజర్ మంజుల రెడ్డి,ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వసంత,మంగపేట ప్రాథమిక హాస్పిటల్ డాక్టర్ స్వపనిక,హై స్కూల్ హెచ్ యం రామప్ప ,ఐ సి డి ఎస్ సూపర్వీసెర్ కమల,అంగన్వాడీ టీచర్స్ నర్సమ్మ,పుష్ప,రజిత,విమల,తేజ,విమల ,విజయ లక్ష్మి,స్కూల్ కమిటీ చైర్మన్ నాగేందర్ రెడ్డి,బి ఆర్ ఎస్ గ్రామధ్యక్షుడు తుక్కాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
