మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 24.. ములుగు ఎమ్మెల్యే సీతక్క తనయుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధనసరి సూర్య శుక్రవారం మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలో పంచాయతీ సెక్రెటరీ కొట్టెం కుమార్ వివాహానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అనంతరం జగ్గయ్య గూడెం గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న దివాకర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండేకట్ల దుర్గ, పాపారావు, సూర్య మిత్రులు ఆజాద్, తదితరులు ఉన్నారు.
