మన్యం న్యూస్ ఏటూరు నాగారం, ఫిబ్రవరి 24
కమిషనర్ అఫ్ ట్రైబల్ వెల్ఫేర్ హైదరాబాద్ ఆదేశానుసారం, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐ. టి. డి. ఏ ఏటూరునాగారం అనుమతితో 2023-24 విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్ స్కూల్ బోయినపల్లి హైదరాబాద్, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ నందు ఐదవ తరగతి లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు భూపాలపల్లి ములుగు జిల్లాల గిరిజన అభివృద్ధి అధికారి, పోచం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏటూర్ నాగారం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో బాలురకు 40 సీట్లు హైదరాబాద్ బోయిన్ పల్లి వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో బాలికలకు 10 సీట్లు , బాలురలకు 10 సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. వీరు 31 ఆగస్టు 22 నాటికి 9 సంవత్సరాల నుంచి11 సంవత్సరాల మధ్య వయసు కలిగి, ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతూ కనీసం ఎత్తు: బాలురు 130 సెంటీమీటర్లు బాలికలు 129 సెంటీమీటర్లు బరువు : బాలురు 26 కేజీలు, బాలికలు 25 కేజీలు ఉన్న వారు అర్హులని అన్నారు వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన బాల,బాలికలు కూడా అర్హులని తెలిపారు. ఈనెల 27, 28_ తేదీలలో ఈ ఎంపికకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్ ఫొటోస్,తో ఎంపిక స్థలం, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ (బాలురు) కొత్తగూడ, మహబూబాబాద్ జిల్లా హాజరు కావాలని కోరారు.
ఇతర సమాచారం కొరకు స్పోర్ట్స్ ఆఫీసర్స్ ని సంప్రదించగలరు.ఆలం శ్యామలత ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ 8332829576 వజ్జ. నారాయణ స్పోర్ట్స్ ఆఫీసర్ జె. ఎస్, భూపాలపల్లి 9701683478
యాలం. ఆదినారాయణ స్పోర్ట్స్ ఆఫీసర్ ములుగు జిల్లా 8008598570 సంప్రదించాలన్నారు.
