అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టమ బ్రహ్మోత్సవాలు
మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 24 మణుగూరు సింగరేణి ఏరియా శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్, దుర్గం రాంచందర్,సుమతి రాంచందర్ దంపతులు పాల్గోన్నారు.వేద మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భక్తజనం పోటెత్తారు.ఆలయ ప్రాంగణమంతా గోవింద నామాలతో మారుమోగింది. గ్రామ కళ్యాణార్ధం,లోక కల్యాణార్థం భక్తుల యదోచిత సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.మేళతాళాలతో,సన్నాయి ధ్వనులు, నృత్యాలు,వేద మంత్రోచ్ఛారణల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంతో పులకరించిపోయారు.అనంతరం ఆలయ కమిటీ వారు అందించిన తీర్ధప్రసాద వితరణ భక్తులు స్వీకరించడం జరిగింది. స్వామి వారి బ్రహ్మోత్సవ ప్రత్యేక పూజలో డాక్టర్ శేషగిరి రావు దంపతులు,లక్ష్మీపతి గౌడ్ దంపతులు, పిచ్చేశ్వరరావు దంపతులతో పాటు మరి కొంతమంది దంపతులు హాజరై బ్రహ్మోత్సవ కార్యక్రమమును అత్యంత
శోభాయమానంగా కమనీయంగా రమణీయంగా జరిపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏరియా అధికారులు,ఆలయ కమిటీ సభ్యులు,శ్రీవారి భక్తులు పాల్గొన్నారు.
