గురువును మించిన శిష్యుడు వయ్య. కాంతారావు
.శుభకార్యంలో ఎదురుపడ్డ గురు శిష్యులు చందా,రేగా
ఆత్మీయంగా పలకరించుకున్న ఇద్దరు నేతలు
మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 24.. గురువు శిష్యునికి జీవిత విలువలను నేర్పించే బోధకుడు, సాహిత్య జ్ఞానంతో పాటు, తన అనుభవ జ్ఞానాన్ని పంచేవాడు అని అందరికీ తెలిసిన విషయం విధితమే. గురు శిష్యులకు సంబంధించి ఈ వాక్యం నూరు శాతం యదార్థం చేస్తు విప్ ,పినపాక ఎమ్మెల్యే ఋజువు చేశారు. కరకగూడెం మండలంలో కొర్నవల్లి గ్రామంలో,కొమరం.సాయమ్మ-హనుమంతయ్య(లేటు)కుమారుడు కిరణ్ కుమార్ వివాహం హారిక ల వివాహ వేడుకకు హజరైన ఆదివాసి సంఘం జాతీయ నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత చందా లింగయ్య దొర,పినపాక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఇరువురు శుక్రవారం ఎదురుపడ్డారు. తన గురువు రాకను గమనించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు తక్షణమే లేచి నిలబడి గురు మర్యాద పాటించారు. అనంతరం గురుశిష్యులు ఇద్దరు కూడా కాసేపు ముచ్చటించారు. నానాటికి విలువలు పతనమవుతున్న తరుణంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువు పట్ల చూపిన మర్యాదను అక్కడున్న వారి చర్చించుకున్నారు. గురువుకు మించిన శిష్యుడయ్యావు ఏమయ్యా కాంతారావు బాగున్నావా.. అని చందా లింగయ్య దొర అనడంలో పినపాక ఎమ్మెల్యే రేగా తను గురువు పట్ల అంకిత భావంతో చూపించిన మర్యాద ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధల్ని చేసింది.
