అంగరంగ వైభవంగా వన దేవతల జాతర
మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 23.
మంగపేట మండలం మల్లూరు గ్రామ పంచాయతీ పరిధి మామిడి గూడెంలో మహిమన్విత వన దేవతలు సమ్మక్క సారలమ్మ జాతర ఆలయ పూజారి (దేవరబాల) పూనెం జనార్దన్ ఆధ్వర్యంలో గురువారం ఆదివాసీ గిరిజన జాతర ను అంగరంగ వైభవంగా నిర్వహించారు.సాయంత్రం 6 గంటలకు మొద్దుల గూడెం వద్ద డోలు వాయిద్యలతో హకుం కొమ్ము ఉదుతూ పూజారులు వడ్డెలు కంకణ వనం సమ్మక్క సారలమ్మ ఎదుర్కొలు కార్యక్రమంను ఆదివాసీ గిరిజన సంప్రదాయం పద్ధతిలో ఘనంగా నిర్వహించారు.ఎదుర్కొలు నుంచి మామిడి గూడెం వెళ్తున్న కంక వనంకు గ్రామస్తులు నీళ్ల బిందెలతో ఏదురేగి నీల్లారా బోసి తమ పిల్లపాపలను చల్లంగా చూడు తల్లి అని మొక్కుకున్నారు.ఈ ఎదుర్కొలు కార్యక్రమంలో శివ సత్తులు పూనకలతో ఉగిపోయారు, యువకులు, మహిళలు, గిరిజన సంప్రదాయంతో దారిపోడవున నృత్యాలు చేశారు.ఈ కార్యక్ర మంలో పూజారులు,వడ్డేలు, జాతర కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,యువకులు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
