UPDATES  

 వాలీబాల్ కిట్లు పంపిణి

వాలీబాల్ కిట్లు పంపిణి
మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి, 23.. మండలంలోని స్థానిక మద్దిరమ్మ సెంటర్, గుర్రాలు చెరువు, మారుతి నగర్ పేరాయి గూడెంలలో గల యువత వాలీబాల్ కిట్లు కావాలని ఎంపీపీ జల్లిపల్లి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే మెచ్చా సూచనలు గురువారం మేరకు మొత్తం 5 వాలీబాల్ కిట్లను స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి చేతుల మీదుగా క్రీడా కారులకు అందించటం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ యువత ఆన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో కూడ రాణించి అశ్వారావుపేట మండలానికి మంచి పేరు తీసుకు రావాలనే ఉద్దేశంతో అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఈ వాలీబాల్ కిట్లని అందజేస్తున్నారని, అలాగే యువకులకు వాలీబాల్ వల్ల మంచి మానసిక ఉత్సాహం ఏర్పడుతుందని అన్నారు. ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ, నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మెచ్చాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ జల్లిపల్లి మండల నాయకులు సరదాగా కాసేపు వాలీబాల్ అడారు.ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి, సర్పంచ్ కలపాల దుర్గయ్య, తెరాస పార్టి టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, పేరాయి గూడెం పార్టీ ప్రెసిడెంట్ చిప్పన పల్లి బజారయ్య, నాయకులు నార్లపాటి రాములు, గంధం వేంకటేశ్వర రావు, ఆళ్ళ సత్యనారాయణ, కలపాల శ్రీనివాస రావు, గంధం వేంకటేశ్వర రావు, చిప్పన పల్లి శ్రీను, సతీష్ రెడ్డి, సుదర్శన్, ఆనంద్, హరికృష్ణ, డేరంగులా శ్రీను, యువకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !