మన్యం న్యూస్ వాజేడు, ఫిబ్రవరి 23
షోతో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను ఏటూర్ నాగారం గిరిజన భవన్ లో ఈనెల 26న ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు వాజేడు మండలం కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థి బండారు నాగమణి బ్లాక్ బెల్ట్, గ్రాండ్ ఛాంపియన్స్ కోసం పోటీపడుతున్నారనీ కరాటే కోచ్ ఏర్ప బాలాజీ తెలిపారు. పాఠశాల ప్రత్యేక అధికారి సుజాత విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.
