ఉత్తమ విద్యను అందించాలి
రుచికరమైన పౌష్టిక ఆహారం విద్యార్థులకు అందించండి.
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం, ఫిబ్రవరి 23
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో రామంజపూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం ఏటూరు నాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు.అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ. మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం,స్నాక్స్ అందిస్తున్నారా ఆరా తీశారు. వంటగది,స్టోర్ రూము,డైనింగ్ హాలు,ఆర్వో వాటర్ ప్లాంట్, ప్రొజెక్టర్లు,కంప్యూటర్ ల పనితీరుపై ఆరా తీశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.టైం టేబుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయడం, పిల్లలు ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలని పాఠశాలలోశానిటేషన్ చేయించాలని, ఉపాధ్యాయులు స్టడీ టైం టేబుల్ ను అనుసరించే విధానంపై హెడ్మాస్టర్ కు, ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ
అనంతరం వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి వైద్య సిబ్బందితో అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు.అలాగే సెల్ కౌంటర్ పని తీరు,ల్యాబ్ రేటరీ తనిఖీ,పరీక్ష నిర్వహణ, డెంగ్యూ,మలేరియా టెస్ట్ కిట్టు లభ్యతపై ఆరా తీశారు. ప్రాథమిక కేంద్ర పరిధిలోని ఉన్న ఆవాస గ్రామాలలో నిర్వహించే వైద్య శిబిరాలపై,ఏఎన్ఎంలు ఆశ వర్కర్ల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.ఫోన్ కాల్స్ స్వీకరించడం సకాలంలో స్పందించడం వాహనంతో అందుబాటులో ఉండే అత్యవసర మందులు వాటిపై ఫస్ట్ రెస్పాండర్,అంబులెన్స్ మొబైల్ అంబులెన్స్ పైలేటును వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రతి కాల్ కు అందుబాటులో ఉండి ప్రతిస్పందించి ఉత్తమ వైద్య సదుపాయాలను అందించాలని ఆదేశించారు.
