మండల సరిహద్దులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ మండల నాయకులు
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 25: మండల కేంద్రలోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పర్యటన సందర్భంగా మండల సరిహద్దులో గల బుర్గుగుడెం దగ్గర గల గౌరారం టోల్ ప్లాజా వద్ద శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి బిఆర్ఎస్ మండల నాయకులు శాలువాతో సన్మానించి ఘన స్వాగతం పలికారు.అనంతరం బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనీ సెల్ఫీలు దిగారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి,మండల నాయకులు వేముల హరీష్ రావు,ఇటుకలహరి,బోయినపల్లి వెంకట సుబ్బారావు,నరేంద్ర తదితరులు బిఆర్ఎస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.