శ్రీశ్రీశ్రీ రామచంద్ర హనుమత్ లక్ష్మణ సాహిత స్వామి వార్ల ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
మన్యం న్యూస్ అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 25: అన్నపురెడ్డిపల్లి మండలంలోని అబ్బుగూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ రామచంద్ర హనుమత్ లక్ష్మణ సాహిత స్వామి వార్ల ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో శనివారం అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీరాముల వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు చెరుకురి రవి,అబ్బుగూడెం సర్పంచ్ కురం ప్రమీల,ఎంపీటీసీ కురం వెంకటలక్ష్మి,భానోత్ భీముడు,చిన్నం రామకృష్ణ,పెద్దాపురం నాగరాజు,చెరుకురి రాంబాబు,గడ్డిపాటి వెంకటేశ్వరరావు,జుబ్బూరి మల్లేశ్వరరావు,సుభాని,ఇనపనూరి రాంబాబు,చల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు.