UPDATES  

 ప్రజాక్షేత్రంలో ఎవరు అనేది తేల్చుకుందాం. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాయం ఫైర్

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, ఫిబ్రవరి 25
పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని మాటలు చెప్పుకుంటు, నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలా మోసం చేసుకుంటు, సోషల్ మీడియాలో డోలు కొట్టేది,బెదిరింపులకు పాల్పడేది పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు.శనివారం మండలంలో ని హనుమాన్ గార్డెన్స్ లో పాయం వెంకటేశ్వర్లు తన నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో పాయం మాట్లాడుతూ,పినపాక నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసింది ఏమీ లేదని విమర్శించారు.నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీటీపీఎస్ నిర్మాణం,వంద పడకల ఆసుపత్రి,ఆర్టీఓ కార్యాలయం,ఫైర్ స్టేషన్, గిరిజన భవనం,బీటి రోడ్లు,సీసీ రోడ్లు తదితర పనులన్నీ తీసుకువస్తే,నేడు ఎమ్మెల్యే రేగా కాంతారావు వాటికి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించి రేగానే అభివృద్ధి చేశాడాని చెప్పుకుంటు నియోజకవర్గంలో,తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు నియోజకవర్గ ప్రజల కోసం పని చేసింది పాయం అయితే..రేగా కాంతారావు మాత్రం తానే పని చేశాడని చెప్పుకుంటు నియోజకవర్గంలో తిరుగుతున్నాడని పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు.రేగా కాంతారావు మూడు తోకలు తగిలించుకొని పినపాకలో తిరుగుతున్నాడు తప్ప, ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు.రేగా తాను తయారుచేసిన మ్యానిఫెస్ట్ లో అన్ని భూటకపు వాగ్దానాలు,ప్రజలను మోసం చేసే వాగ్దానాలు తప్ప మరొకటి లేదన్నారు.మ్యానిఫెస్ట్ లో చేసిన వాగ్దానాలు ఒక్క వాగ్దానం అయిన రేగా చేశాడా అని మీడియా సాక్షిగా పాయం ప్రశ్నించారు.మేనిఫెస్టోలో మణుగూరుని రెవెన్యూ డివిజన్ చేస్తానని చెప్పిన రేగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు..అభివృద్ధి పేరుతో పార్టీ మారి ప్రజలను మోసం చేస్తూ,కోట్ల రూపాయల ఆస్తులు,సంపాదించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు అభివృద్ధి పేరుతో ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.రేగా కాంతారావు తన సొంత మండలం అయిన కరకకగూడెం మండలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు.పాయం తన హయంలో 150 కోట్ల రూపాయలతో పులుసు బొంత ప్రాజెక్ట్ తీసుకువస్తే నేటికి ఆపనులు ప్రారంభం కాలేదన్నారు.రాయగూడెం నుండి పర్ణశాల బ్రిడ్జి,భద్రాచలం నుండి కరీంనగర్ వరకు 398 కిలోమీటర్ల నేషనల్ హైవే పనులను ఎందుకు మంజూరు చేయించలేకపోయాడని ప్రశ్నించారు.పోడు భూముల విషయంలో పట్టాలు ఇప్పిస్తానని గిరిజనులను మోసం చేశారని ఆయన ఆరోపించారు.29,216 మందికి ఒక లక్ష 3600 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చి,నీ నిజాయితీని నిరూపించుకోమని రేగాకు పాయం సవాల్ విసిరారు. రేగా కాంతారావుకి నిజంగా దమ్ము ఉంటె నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేశాడో చూపించగలడా అని ఆయన ప్రశ్నించారు.పొంగులేటి నా గురువు..నా జీవితం ఆయనకే అంకితమన్నారు.సోషల్ మీడియాలో డబ్బా కొట్టేది ఆపి ప్రజల కోసం పని చేయమన్నారు.ఈసమావేశంలో మణుగూరు వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వర్లు, సమితిసింగారం ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్,ఉప సర్పంచ్ లు తరుణ్ రెడ్డి, కనకయ్య,సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !