మన్యం న్యూస్ చండ్రుగొండ ఫిబ్రవరి 25 : మండల కేంద్రంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు తన అభిమానులకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో పొంగిలేటి శీనన్న క్యాంపు కార్యాలయం పెట్టడం జరిగిందని అన్నారు.అధికారం ఉంటేనే, పదవులు ఉంటేనే ప్రజలకు దగ్గరగా ఉండాలనే సిద్ధాంతాలను పక్కనపెట్టి నేను ఎప్పటికీ ప్రజలతోనే ఉంటానని, ప్రతి మండల క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, తెలంగాణ వస్తే బ్రతుకులు మారతాయని, యువత బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ఇప్పుడు నిరుద్యోగం మరీ ఇంకా ఎక్కువగా పెరిగిందని, ఏజెన్సీ ప్రాంతాలలో పోడు భూములు గిరిజనులకు, ముఖ్యంగా గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మువ్వా విజయ్ బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరకుళ్ల సత్యనారాయణ, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సారేపల్లి శేఖర్,మాలోత్ బోజ్య నాయక్, నరకుళ్ల అప్పాజీ, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.