UPDATES  

 కొత్తూరులో ఘనంగా బొడ్రాయి వేడుకలు రూ.50వేల రూపాయల విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే రేగా

మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 26 మండల పరిధిలోని అమరారం పంచాయతీలో గల కొత్తూరు గ్రామంలో ఆదివారం   బొడ్రాయి  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రూ.50వేల రూపాయలు విరాళంగా ఇవ్వగా, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సొసైటీ డైరెక్టర్ కామేశ్వరరావు చేతుల మీదుగా గ్రామ అధ్యక్షుడు బిజ్జ రమేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా కొత్తూరు గ్రామ మహిళలు బిజ్జ రాంబాయి, జబ్బ జయ, ఇతరులు  నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివాసీల కోసం అవసరమైన సహాయాన్ని అందిస్తున్న ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, కొత్తూరు గ్రామ ప్రజలైన బిజ్జ నవీన్, బిజ్జ నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త  ఎడ్ల కుమారస్వామి, బొడ్రాయి ప్రతిష్ట అర్చకులు వీరస్వామి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !