విశ్రాంతి ఉద్యోగులకు స్థలం, ఇళ్లను మంజూరు చేయాలని… చండ్రుగొండ యూనిట్ అధ్యక్షుడు కాల్లూరి సుధాకర్ రావు డిమాండ్.. మన్యం న్యూస్ చండ్రుగొండ ఫిబ్రవరి 26 :మండల కేంద్రంలో ఆదివారం జిల్లా పరిషత్ పాఠశాల లో జాతీయ విశ్రాంతి ఉద్యోగుల డే సందర్భంగా యూనిట్ అధ్యక్షులు కాల్లూరి సుధాకర్ రావు అధ్యక్షతన విశ్రాంతి ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విశ్రాంతి ఉద్యోగులు ఎన్నో ఏళ్ల నుంచి పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు విశ్రాంతి ఉద్యోగులకు ఇంటి స్థలంతో పాటు ఇళ్లను కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెన్షనర్స్ కు హెల్త్ కార్డులు,ఉచిత బస్సు పాస్, పెన్షన్ సకాలంలో ఇచ్చే విధంగా ప్రభుత్వం పూనుకోవాలన్నారు.2023 సంవత్సరం గాను పిఆర్సి అమలు చేయాలని ఆయన కోరారు. పెన్షనర్ పై ఎటువంటి ఆధారం లేని పెన్షనర్స్ పై ఆధారపడేఆడపిల్లలకు పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగిని వెలగల సరస్వతితోపాటు పలువురి విశ్రాంతి ఉద్యోగులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పూనం నాగేశ్వరరావు, రామకృష్ణ,రామకృష్ణమాచారి అజరయ్య, వెంకటేశ్వరరావు,ఆంజనేయ శాస్త్రి, ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
