పాత బంగారు చెలక పంచాయతీలో సమస్యలను పరిష్కరించకపోతే బలమైన ప్రజా ఉద్యమం తప్పదు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హెచ్చరిక మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26.. . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం పాత బంగారు చెలక పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే బలమైన ప్రజా ఉద్యమం తప్పదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆధ్వర్యంలో బంగారుచెలక లో పెద్ద బోయిన సతీష్ ఆజాద్ అధ్యక్షతన ప్రజా సమస్యలపై జనరల్ బాడీ సమావేశం జరిగింది .ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ పంచాయతీ పరిధిలో సుమారు వెయ్యి మంది గిరిజనులు 3వేల ఎకరాలు సర్వేనెంబర్ 381 గల భూమిని కొన్ని వందల సంవత్సరాల నుంచి తరతరాలుగా సాగుచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని వారికి నాటి ప్రభుత్వం రెవిన్యూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి కొంతకాలం ప్రభుత్వ పథకాలను కొనసాగించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అట్టిపట్టాలను రద్దు చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. పట్టాలు రద్దు కావడంతో గిరిజనులకు ప్రభుత్వ పథకాలు బ్యాంకు రుణాలు, రాక విద్యుత్ సౌకర్యం లేక వ్యవసాయ రంగం కుంటుబడి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమగ్ర సర్వే పట్టా హక్కులు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టుపై ఇరువైపులా కుడి ఎడమ కాలువలను మరమ్మతులు చేసి బంగారు చెలక వరకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .తుమ్మలగూడెం వద్ద ఇరసాని వాగుపై వంతెన నిర్మించి తుమ్మలగూడెం నుంచి వెంకటాపురం వరకు బిటి రోడ్డు మంజూరు చేయాలని పేదలను ఆదుకోవాలని కోరారు త్రీఫేస్ కరెంటు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు వ్యవసాయానికి బోర్లు లేక ఇబ్బందులు పడుతున్నారని త్రీఫేస్ కరెంటు ఇచ్చి గిరి వికాస పథకం కింద ప్రతి గిరిజన రైతుకి బోర్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోతు కృష్ణ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి మాచర్ల సత్యం జిల్లా నాయకులు ఆజాద్ మండల నాయకులు పూనం నరసింహారావు బాద్షా పాపారావు గోపే నరసయ్య చంద్రశేఖర్ రాజశేఖర్ నాగమ్మ జ్యోతి రోజా పెద్ద బోయిన సతీష్ ప్రజాపందా కొత్తగూడెం డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
