మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి 26: ఇల్లందు మున్సిపాలిటీలో కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ఏరీయల్లోనుంచి స్థానిక ప్రజలు పిర్యాదు చేయటంతో, కుక్కల అదుపు కై మున్సిపాలిటీ అధికారులు ఆదివారం చర్యలు మొదలుపెట్టారు. చర్యల్లో భాగంగా 1వార్డు లో కుక్కలు ఎక్కువగా, గుంపులుగా తిరిగే ఏరియాలను గుర్తించటం జరిగింది.గుర్తింపు తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు.కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వార రవి,శానిటరీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , కళ్యాణ్, బిల్ కలెక్టర్ బి కృష్ణ,వార్డు ఆఫీసర్ వెంకటేష్, రెండోవార్డ్ ఆఫీసర్ ప్రవీణ్, కందుల రఘు వీరారెడ్డి పాల్గొన్నారు.
