UPDATES  

 జాతరను పురస్కరించుకొని వాలీబాల్ క్రీడా పోటీలు

మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 26 పూనెం వారి ఇలవేల్పు సుర గుండయ్య జాతరను పురస్కరించుకొని వాలీబాల్ పోటీలను జాతర నిర్వాహకులు ఆదివారం ప్రారంభించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఈ జాతర జరుగుతుందని పూనెం రంగయ్య పేర్కొన్నారు. ఈ వాలీబాల్ పోటీలకు మొత్తం 65 జట్లు పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన క్రీడాకారులకు జాతర ముగింపు రోజు బహుమతులు అందజేయనున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నరసయ్య, రామచంద్రయ్య, రామయ్య, పాపయ్య, సూరయ్య, వెంకన్న , సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !